ఎప్పుడు ఏ ఇద్దరు కలుస్తారొ తెలియదు.. భగవంతుదు ఎవర్ని ఎవరితో కలుపుతాడో.. అంతకంటె తెలియదు.. ఇద్దరు వ్యక్తుల మద్య పరిచయం.. అభిమానం.. ఆరాదన.. ప్రేమ.. మోహం.. సాంగత్యం.. ఎందుకు ఏర్పడతాయో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ప్రతిచర్య, సంఘటన, కలయిక, ప్రేమకు భగవంతుడి ధ్రుష్టిలొ ఎదో ఒక ప్రయోజనం ఉండి తీరుతుంది.. ఒక వ్యక్తిని చూస్తె ఆ వ్యక్తి కొసం ఏదైనా చేయాలనిపిస్తుంది.. మరొకర్ని చుస్తె లొభిగా ఉండాలనిపిస్తుంది.. ఆ వ్యక్తి ఆడ, మగ ఎవరైన కవొచ్చు. ఇలాంటి అనుబంధాలన్నీ ఆ వ్యక్తి ప్రేరణకు అతీతంగానే జరుగుతాయి.. ఇద్దరు వ్యక్తుల మధ్య వారి ప్రమేయం లేకుండానే, అంతర్లీనంగా, అంతర్వాహినిగా ప్రెమ ప్రవహిస్తు ఉంటుంది.. అది ఆ ఇద్దరి అత్మలకే తెలుసు.. దాన్నెవరూ ఆపలెరు. అది సామాజికంగా, సంఘపరంగా నిషెధించబదినదే కావచ్చు.. ఈ ప్రపంచాన్ని ప్రేమ మాత్రమే ముందుకి నడిపించగలదు.. మానవ మనుగడకు అదె పునాది.. అదె అక్సిజెన్.. ప్రేమ ఎప్పుడు, ఎవరి మీద, ఎందుకు పుడుతుందొ తెలిసినవాడు భగవంతుడొక్కడే..
No comments:
Post a Comment